నంగునూరు(సిద్దిపేట): జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ చొరవతో కాలువ పూర్తి కావడంతో వాగవతలి గ్రామాలకు సాగునీరు అందుతోందని ఏఎంసీ చైర్మన్ యాదగిరి అన్నారు. సోమవారం ఘణపూర్ పంప్‌హౌస్ వద్ద ప్రత్యేక పూజలు చేసి మంత్రి వివేక్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో పంప్‌హౌస్ పూర్తి చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోయిన పనులు పూర్తి చేసిందన్నారు. కార్యక్రమంలో సత్తయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్, రాములు, రవి, రమేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


