రేవంత్‌ పాలనలో రాష్ట్రం విధ్వంసం | - | Sakshi
Sakshi News home page

రేవంత్‌ పాలనలో రాష్ట్రం విధ్వంసం

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

కేసీఆర్‌ హయాంలోనేఅన్ని రంగాలు పురోగతి

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌: ఎన్నో బలిదానాలు, త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ నేడు సీఎం రేవంత్‌రెడ్డి కబంధహస్తాల్లో విధ్వంసమవుతోందని, ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం గజ్వేల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అబద్దపు పాలనలో ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ హయాంలో అన్ని రంగాల్లో పురోగతిని సాధించిన తెలంగాణ ప్రస్తుతం అధ్వానస్థితికి చేరిపోయిందన్నారు. కేసీఆరే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు మరోసారి బలంగా నమ్ముతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిశెట్టి చందన, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

జిల్లా పార్టీ కార్యాలయంలో..

సిద్దిపేటజోన్‌: జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శర్మ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్స్‌లు పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మంజుల, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు ప్రభాకర్‌, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement