కొత్త కార్యవర్గాలను ఎన్నుకోండి | - | Sakshi
Sakshi News home page

కొత్త కార్యవర్గాలను ఎన్నుకోండి

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాలఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పార్టీ కోసం కష్టపడే వారికిప్రాధాన్యతనివ్వండి బూత్‌స్థాయి నుంచిజిల్లాస్థాయి వరకు ఎన్నిక జిల్లా నాయకులతో వన్‌ టూ వన్‌ సమావేశాలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కాంగ్రెస్‌ పార్టీని బూత్‌స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు చేయాలన్నారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సోమవారం మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల క్రియాశీలక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పలువురు నాయకులతో మీనాక్షి నటరాజన్‌ వన్‌ టూ వన్‌గా సమావేశమయ్యారు. పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న విషయాలను అడిగినట్లు తెలిసింది. అనంతరం మీనాక్షి మాట్లాడుతూ...బూత్‌, గ్రామ, మండల, బ్లాక్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీల్లో మూడేళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరిని మార్చాలన్నారు. ప్రస్తుతం ఎన్నుకునే ఈ కమిటీ రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల వరకు కొనసాగుతారని, అందుకే ఈ కార్యవర్గం ఎన్నికల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆయా కార్యవర్గాలను ఎన్నుకుని వివరాలను పీసీసీకి పంపాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చేలా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్‌ షెట్కార్‌, పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి ప్రీతం, అహ్మదుల్లా, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి (సంగారెడ్డి), ఆంక్షారెడ్డి (సిద్దిపేట), ఆంజనేయులుగౌడ్‌ (మెదక్‌) తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement