వడ్డెర జాతీయ అధ్యక్షుడు శ్రీధర్
కలెక్టరేట్ ఎదుట సంఘంనాయకుల నిరసన
కలెక్టరేట్ ఎదుట వడ్డెర సంఘం నాయకుల నిరసన
సిద్దిపేటరూరల్: వడ్డెర కులవృత్తిని అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని వడ్డెర జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వడ్డెర సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో సుమారు 60 వడ్డెర కుటుంబాలు 70 ఏళ్లుగా కులవృత్తిని నమ్ముకుని బండరాయి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. కొంతమంది రియల్‌ఎస్టేట్, రాజకీయ నాయకులు తమ పలుకుబడితో బండరాయి పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీంతో పేద కుటుంబాలైన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే అధికారులు చొరవ తీసుకుని వడ్డెకుటుంబాలకు వెంటనే న్యాయం చేసి, బండప్రాంతాలపై హక్కులు కల్పించాలన్నారు. వారికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడు తిరుపతి, జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు స్వామి, రమేశ్, కనకయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


