చెత్త సేకరణను ప్రైవేటీకరిస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

చెత్త సేకరణను ప్రైవేటీకరిస్తే సహించం

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

గజ్వేల్‌: గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో చెత్త సేకరణను ప్రైవేటీకరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు నాయిని సత్యలక్ష్మి, గుంటుకు లక్ష్మీ, సంతోషి, రమేష్‌, ఉపేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి హెచ్చరించారు. సోమవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చెత్త సేకరణ పేరుతో ప్రజలపై అదనపు భారం మోపాలని చూడడం ఎంతవరకు సమంజసమన్నారు. మెరుగైన పాలన అందించాల్సింది పోయి ఈ విధానం సరికాదని హెచ్చరించారు. ఇప్పటికై నా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ మున్సిపల్‌ కౌన్సిలర్ల హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement