జయంత్యుత్సవాలకు అంకురార్పణ | - | Sakshi
Sakshi News home page

జయంత్యుత్సవాలకు అంకురార్పణ

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

వర్గల్‌(గజ్వేల్‌): సుప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీ నృసింహ క్షేత్రంలో శ్రీవారి జయంత్యుత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం గర్భగుడిలో స్వయంభూ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి విశేషాలంకృతులను చేశారు. ఆలయ ముఖమండపంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం నిర్వహించారు. రక్షాబంధనం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. స్వామివారికి నివేదన అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. వేడుకల్లో ఆలయ ఈఓ బెల్లంకొండ రంగాచారి, ధర్మకర్తలు నాయకం శ్రీనివాస్‌, కొత్తపల్లి శ్రీనివాస్‌, గాలి కిష్టయ్య, కేంద్ర జౌలి పరిశ్రమ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

నాచగిరిలో భక్తిపారవశ్యం

Advertisement
 
Advertisement
Advertisement