బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత | - | Sakshi
Sakshi News home page

బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ కొరత

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

సిద్దిపేటకమాన్‌: జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు వెలిశాయి. జిల్లా కేంద్రంలోని రెండు, మూడు బంకుల్లో మాత్రమే ఇంధనం ఉండడంతో వాహనదారులు గంటల తరబడి క్యూలో ఉన్నారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా వరకు బంకులు మూతపడటంతో రైతులు, వినియోగదారులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సమస్య తీవ్రంగా ఉంది. పది రోజుల క్రితమే నిర్వాహకులు డబ్బులు చెల్లించినప్పటికీ కంపెనీల నుంచి ఇంధనం సరఫరా కావడం లేదని బంకుల నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement