గత నాలుగు రోజులుగా డీజిల్ దొరకక హార్వెసర్లు, ట్రాక్టర్లు నడవడం లేవు. వరికోతలు ఆగిపోయాయి. నా ట్రాక్టర్‌లో రెండు రోజుల క్రితమే డీజిల్ అయిపోవడంతో పొలం వద్దే ఆగిపోయింది. క్యాన్లు పట్టుకొని రోజు బంకుల చుట్టూ తిరుగుతున్నా. ఇంధనం ఎప్పుడు వస్తదో వరి కోతలు ఎప్పుడు కోయాలో అర్థం కావడం లేదు.
– భూపతిరెడ్డి, రైతు, దుబ్బాక
ఇబ్బందిగా మారింది
పెట్రోల్, డీజిల్ కొరతతో తమకు చాలా ఇబ్బంది తయారైంది. డబ్బులు కట్టి వారం రోజులు అవుతున్నా ఇంధనం సరఫరా కావడం లేదు. చాలా బంకులు ఖాళీగానే ఉన్నాయి. వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్నాం. వరికోతల సమయంలో కొరత ఏర్పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
– సురేశ్, జిల్లా పెట్రోల్ బంకుల
ఓనర్ల సంఘం ప్రెసిడెంట్


