జిల్లాలో గత మూడు రోజులుగా ఇంధన కొరత వేధిస్తోంది. మొత్తం 180కి పైగా పెట్రోల్ బంకులు ఉండగా, సగానికి పైగా బంకుల్లో కొరత ఏర్పడింది. వారం క్రితమే డబ్బులు కట్టినప్పటికీ, కంపెనీల నుంచి బంకులకు ఇంధనం సరఫరా కావడం లేదంటూ బంకుల యజమానులు చెబుతున్నారు. దుబ్బాక పట్టణంతో పాటు శివారులో 7 పెట్రోల్ బంకులుండగా, ఐదు పెట్రోల్ బంకుల్లో మూడు రోజులుగా, మిగితా రెండు బంకుల్లో శనివారం మధ్యాహ్నం వరకే పెట్రోల్, డీజిల్ అయిపోయింది. దీంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, మిరుదొడ్డి, చిన్నకోడూర్, నంగునూర్, భూంపల్లి, దౌల్తాబాద్, రాయపోల్, వర్గల్, జగదేవ్‌పూర్ మండలాల్లో సైతం కొరత తీవ్రంగా ఉంది. సరిగ్గా వరి కోతల సమయంలోనే సమస్య ఉత్పన్నం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, సంబంధిత కంపెనీలు స్పందించి ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వరి కోతల వేళఇంధన కొరత
నాలుగైదు రోజులుగా బంకుల మూత
ఇబ్బంది పడుతున్న వినియోగదారులు


