పది ఎకరాలకుపైగా మంటలు
అదుపులోకి తెచ్చిన
అగ్నిమాపకశాఖ అధికారులు
అర్బన్‌పార్కులో ఎగసిపడుతున్న మంటలు
గజ్వేల్‌రూరల్: అర్బన్‌పార్కులో అగ్నిప్రమాదం జరిగి సుమారు 10 ఎకరాల్లో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన గజ్వేల్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. అటవీశాఖ, అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ శివారులో అటవీ ప్రాంతం 292 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో ఉన్న అర్బన్‌పార్కు(కల్పకవనం) వెనుకభాగంలో ప్రమాదవశాత్తు ఎండుగడ్డి అంటుకొని మంటలు వ్యాపించడాన్ని గుర్తించిన సిబ్బంది స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. స్థానిక అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది చంద్రారెడ్డి, వెంకటేష్, సతీష్, కనకరాజు, నాగరాజు, రవికుమార్‌ల బృందం ప్రమాదస్థలికి చేరుకొని ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ట్రాన్స్‌ఫార్మర్ నుంచి వచ్చిన మిరుగుల కారణంగా మంటలు అంటుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.


