కలెక్టర్ హైమావతి
అధికారులకు దిశానిర్దేశం
మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● బీఆర్‌ఎస్ బంద్.. హోరెత్తిన ధర్నాలు, ర్యాలీలు ● ఉద్రిక్తతల నేపథ్యంలో రంగంలోకి పోలీస్ బలగాలు
గజ్వేల్:బీఆర్‌ఎస్ బంద్ నేపథ్యంలో సోమవారం గజ్వేల్ పట్టణం దద్దరిల్లింది. పోలీసు బలగాలు భారీగా రంగంలోకి దిగా యి. మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేయడమేకాకుండా అక్రమంగా సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీ గజ్వేల్ నియోజవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చందన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, నాయకులు తదితరులు ప్రజ్ఞాపూర్ ఆర్‌టీసీ బస్టాండ్ వద్దకు ఉదయమే చేరుకొన్నారు. బస్సుల రాకపోకలను అడ్డుకునేందుకు గేటు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడికి చేరుకొని చాలాసేపటి తర్వాత వారిని అక్కడినుంచి పంపించారు. ఆ తర్వాత ప్రజ్ఞాపూర్ చౌరస్తా కొద్దిసేపు నిరసన తెలిపి అక్కడి నుంచి గజ్వేల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
కాంగ్రెస్ నేతలు ఎదురుపడటంతో..
పట్టణంలో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కేసీఆర్ క్యాంపు కార్యాలయం వరకు బీఆర్‌ఎస్ నాయకులు ర్యాలీగా బయలుదేరారు. ఇదే క్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి రోడ్డుపైకి నాయకులు, కార్యకర్తలతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమెను ఇక్కడికి రావొద్దంటూ వారించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు సైతం అక్కడికి చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బంద్ పిలుపు నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను రోడ్లపైకి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలు భారీ సంఖ్యలో ర్యాలీగా పోలీస్‌స్టేషన్ వైపు దూసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిని, కాంగ్రెస్ నాయకులను పక్కనే ఉన్న వారి ఇంటి వద్దకు పంపించారు. అయినా బీఆర్‌ఎస్ కార్యకర్తలు తగ్గలేదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆంక్షారెడ్డి ఇంటివైపు దూసుకెళ్లకుండా అడ్డంగా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. బంద్ సందర్భంగా పట్టణంలో పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.
ఆంక్షారెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు
పోలీసులతో బీఆర్‌ఎస్ నేతల వాగ్వాదం
అర్జీలు సత్వరం పరిష్కరించండి
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణికి వస్తున్న క్రమంలో అధికారులు వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 216 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, అధికారులు పాల్గొన్నారు.
న్యాయవాదుల సంక్షేమానికి కృషి
రాష్ట్రబార్ కౌన్సిల్ సభ్యుడు కిరణ్‌కుమార్
సిద్దిపేటకమాన్/దుబ్బాక: న్యాయవాదుల సంక్షేమానికి కృషిచేస్తానని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కిరణ్‌కుమార్ అన్నారు. సోమవారం సిద్దిపేట కోర్టులో, దుబ్బాక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన కిరణ్‌కుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేటలో నూతన కోర్టు భవన నిర్మాణానికి సంబంధించి అవసరమైన చర్యలను వేగవంతం చేసేలా చర్యలు చేపడతమన్నారు. అలాగే దుబ్బాకలో కోర్టు నూతన భవనం నిర్మాణం కోసం కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట, దుబ్బాక బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.


