లక్ష్మీనర్సింహుడి సన్నిధిలో న్యాయమూర్తులు | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీనర్సింహుడి సన్నిధిలో న్యాయమూర్తులు

Apr 6 2026 8:36 AM | Updated on Apr 6 2026 8:36 AM

బెజ్జంకి(సిద్దిపేట): లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, అదనపు జడ్జి జయప్రసాద్‌ కుటుంబసభ్యులు ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రభాకర్‌, పూజారి మధుసూదనాచారి వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ఉత్తమ అర్చకుడిగా

భానుమూర్తి

హుస్నాబాద్‌: జిల్లా ఉత్తమ అర్చకుడిగా హుస్నాబాద్‌ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకుడు పోలోజు భానుమూర్తి ఎంపికయ్యారు. రాష్ట్ర అయ్యప్ప సేవార్తి ఐక్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బేగంపేటలో పుష్పగిరి పీఠం ఆశ్రమంలో అయ్యప్ప స్వామి అర్చకుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగద్గురు విద్యారణ్య భారతీ స్వామి చేతుల మీదుగా హుస్నాబాద్‌ అర్చకుడు భానుమూర్తి ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో హుస్నాబాద్‌ అయ్యప్ప స్వామి దేవాలయ అధ్యక్షుడు వెంకట్‌ పాల్గొన్నారు.

సీబీఎస్‌ఈ సిలబస్‌లో

పాపన్న చరిత్ర చేర్చండి

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు వినతి

చిన్నకోడూరు(సిద్దిపేట): బహుజన ఆత్మగౌరవ ప్రతీక సర్వాయి పాపన్న గౌడ్‌ చరిత్రను సీబీఎస్‌ఈ సిలబస్‌లో చేర్చాలని జైగౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు గంధం హరిగౌడ్‌ కోరారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు వినతి పత్రం అందజేశారు. జై గౌడ ఉద్యమ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్‌తదితరులతో కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. పాపన్న గౌడ్‌ చరిత్ర, ప్రాధాన్యతను వివరించినట్లు తెలిపారు. పాపన్న గౌడ్‌ నిర్మించిన చారిత్రక కోటలను కేంద్ర పర్యాటక శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు.

పద్మశాలీల అభ్యున్నతికి కృషి

నంగునూరు(సిద్దిపేట): రాజకీయంగా ఎంతో వెనుకబడిన పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తామని నంగునూరు ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ సాదుల పవన్‌కుమార్‌ అన్నారు. ఆదివారం పద్మశాలీ సమాజం ఆధ్వర్యంలో పవన్‌, పంచాయతీ కార్యదర్శి సూరం నితీష్‌కుమార్‌లను సన్మానించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డారని, నిరుపేదలకు తన వంతుగా సహాయ, సహకారాలు అందజేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement