చిల్లర చేష్టలు సహించం | - | Sakshi
Sakshi News home page

చిల్లర చేష్టలు సహించం

Apr 6 2026 8:36 AM | Updated on Apr 6 2026 8:36 AM

చర్యకు ప్రతి చర్యకు తప్పదు

మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి

గజ్వేల్‌: స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ క్యాంపు కార్యాలయంపైనే కాంగ్రెస్‌ నేతలు దాడులకు తెగబడటం సహించరానిదని, ఇప్పటికై నా చిల్లర చేష్టలను మానుకోకపోతే చర్యకు ప్రతి చర్య తప్పదని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి హెచ్చరించారు. ఆదివారం గజ్వేల్‌లో ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ వైఫల్యాల వల్ల రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను తిరిగి సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఇది మింగుడు పడక కాంగ్రెస్‌ నేతలు ఇష్టానుసారంగా గూండాయిజం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా రాహుల్‌గాంధీ తన కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను పెట్టుకోగలరా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా గజ్వేల్‌లో సోమవారం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవీ రవీందర్‌, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, బీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు, నాయకులు ఊడెం కృష్ణారెడ్డి, నూనె కుమార్‌, రాంచంద్రం, పాండుగౌడ్‌, ఆహ్మద్‌, స్వామిచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement