మల్లన్న ఆలయంలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

Apr 6 2026 8:36 AM | Updated on Apr 6 2026 8:36 AM

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులరాకతో సందడి నెలకొంది. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారమే క్షేత్రానికి చేరుకున్న భక్తులు వేకువజామున నిద్ర లేచి పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

స్వామివారిని దర్శించుకున్న సైబరాబాద్‌ ఏసీపీ

కొమురవెల్లి మల్లన్నను సైబరాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాన్ని అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement