టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి
నాయిని యాదగిరి
గజ్వేల్: మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికైనా గజ్వేల్‌లోని తన క్యాంపు కార్యాలయానికి వచ్చి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి డిమాండ్ చేశారు. సోమవారం గజ్వేల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అందువల్లే తాము ప్రజల పక్షాన పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పారు. క్యాంపు కార్యాలయానికి వెళ్ళి తాము సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టడంపై బీఆర్‌ఎస్ నేతలు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు సమీర్, గుంటుకు శ్రీను పాల్గొన్నారు.


