రంజాన్‌కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రంజాన్‌కు సర్వం సిద్ధం

Mar 21 2026 6:39 AM | Updated on Mar 21 2026 6:39 AM

బీజేపీతోనే ప్రగతి సాధ్యం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ శనివారం నిర్వహించుకునేందుకు జిల్లాలోని ముస్లింలు సిద్ధమయ్యారు. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. షామియానాలు, తాగునీరు, తదితర ఏర్పాట్లను మున్సిపల్‌, గ్రామ పంచాయతీ నిర్వాహకుల ఆధ్వర్యంలో చేపట్టారు. మసీదుల వద్ద పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.

అల్లా దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఈద్‌ ఉల్‌ ఫితర్‌ పర్వదినం సందర్భంగా ముస్లింలకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే అతిపెద్ద గొప్ప పండుగల్లో రంజాన్‌ ఒకటని కొనియాడారు.ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందన్నారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అల్లా దయతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement