7 నుంచి సీఐటీయూ రాష్ట్ర మహాసభలు
సిద్దిపేటఅర్బన్: మెదక్‌లో 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని యూనియన్ భవన్‌లో సోమవారం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బహరంగసభకు ముఖ్యఅతిథిగా ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు హాజరవుతారన్నారు. సీఐటీయూ ఆలిండియా అధ్యక్షురాలు హేమలత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు, పాలడుగు భాస్కర్ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి భాస్కర్, సహాయ కార్యదర్శి రవికుమార్, నాయకులు సాదిక్, రాజు, సాజిత్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య


