
అసలేం జరిగింది?
మెదక్‌జోన్: జిల్లాలో సంచలనం రేపిన గిరిజన మహిళ హత్యాచారం ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి వద్ద సెల్‌ఫోన్ లేకపోవడంతో అసలేం జరిగిందనే దానిపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే మహిళ పని కోసం టిఫిన్ కట్టుకుని సమీప బంధువు (మహిళ)తో కలిసి మెదక్ అడ్డా వద్దకు ఇంటి నుంచి ఆటోలో బయల్దేరింది. ఆ తర్వాత ఎక్కడకు వెళ్లింది? ఎవరిని కలిసింది? అనే విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ శనివారం తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి క్లూస్‌టీంను రంగంలోకి దింపారు. ఆటోడ్రైవర్‌తో పాటు బాధితురాలితో వచ్చి న మరో మహిళను విచారించినట్లు తెలుస్తోంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మంబోజిపల్లి చౌరస్తాలో ఎన్ని ఆటోలున్నాయనే విష యాన్ని తెలుసుకునేందుకు అక్కడ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితురాలి భర్తతో పాటు ఆ తండాలోని పలువురిని సైతం విచారించారు. అయితే సదరు మహిళ మంబోజిపల్లికి రాగానే తనకు ఇక్కడే పని ఉందని ఆటో దిగిపోగా, ఆమె బంధువు ఓ మేసీ్త్ర వద్ద పనికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పని కల్పిస్తామని ఇద్దరు వ్యక్తులు ఆ మహిళను కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, ఏడుపాయల దేవస్థానం సమీపంలోని ఓ వెంచర్ వద్దకు తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ క్రమంలో ఆమైపె అత్యాచారం చేయబోగా సదరు మహిళ ప్రతిఘటించటంతో చీరతో చేతులు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె బతికుంటే విషయం బయట పడుతుందని ఆమైపె దాడి చేశారు. చనిపోయిందని భావించిన దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న మహిళను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా మెదక్ జిల్లా ఆస్ప త్రికి తరలించారు. కాగా ఈ ఉదంతంలో ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మెదక్ మండలం జానకంపల్లి పంచాయతీ పరిధిలోని సంగాయిగూడ తండాకు చెందిన ఈ మహిళకు ఐదుగురు సంతానం. అందులో పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, మిగతా నలుగురు పిల్లలను రెక్కల కష్టం మీద పోషిస్తున్నారు. దంపతులిద్దరూ అడ్డా కూలీలుగా పనిచేస్తుంటారు.
గిరిజన మహిళ హత్యాచారంపై
పోలీసుల దర్యాప్తు ముమ్మరం
సంచలనం రేపిన కొల్చారం ఘటన