
వైభవంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ
దుబ్బాక: పట్టణంలో శనివారం ప్రధాన గ్రామదేవత బొడ్రాయి (నాభిశిల, భూలక్ష్మీదేవి) విగ్రహాల ప్రతిష్ఠ కనులపండువగా జరిగింది.అంతకు ముందు వేదస్వస్తి తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరై పూజలు చేశారు. వారు మాట్లాడుతూ దుబ్బాక పట్టణంలో బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. భవిష్యత్త్‌లో అమ్మవారి కృపతో దుబ్బాక పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు పట్టణంలోని అన్ని కులసంఘాల పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.