రిజర్వేషన్లు అడ్డుకోవడం అన్యాయం | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లు అడ్డుకోవడం అన్యాయం

Oct 11 2025 9:32 AM | Updated on Oct 11 2025 9:32 AM

రిజర్

రిజర్వేషన్లు అడ్డుకోవడం అన్యాయం

బీసీ కుల సంఘాల నాయకులు

సిద్దిపేటకమాన్‌: బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అడ్డుకోవడం అన్యాయమని బీసీ కుల సంఘాల నాయకులు అన్నారు. రిజర్వేషన్లను అడ్డుకుంటున్న మాధవరెడ్డి దిష్టిబొమ్మను పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో బీసీ కుల సంఘాల నాయకులు శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి వెనుకబాటు తనానికి గురవుతున్న బీసీలకు సముచిత వాటా దక్కుతుంటే అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీసీ బిల్లుని పార్లమెంట్‌లో పెట్టి చట్టబద్దత కల్పించాలన్నారు. కార్యక్రమంలో పలువురు బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్‌

నంగునూరు(సిద్దిపేట): బీసీ సంఘాల పిలుపు మేరకు నంగునూరు మండలంలో శుక్రవారం వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. రాంపూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద హన్మకొండ రహదారిపై జేపీతండా వాసులు రాస్తారోకో నిర్వహించారు. నంగునూరులో బీసీ సంఘాల ఐఖ్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలో రిజర్వేషన్‌ వర్తింపజేయాలన్నారు.

రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పిదాలే నేడు బీసీ రిజర్వేషన్లకు అడ్డంకిగా మారాయన్నారు. రాష్ట్రంలో కులగణన గత ప్రభుత్వం చేయకపోవడం శోచనీయమన్నారు. నేడు బీసీ రిజర్వేషన్లకు అడ్డుగా నిలువడం విడ్డురంగా ఉందన్నారు. రాష్ట్రంలో కులగణన శాసీ్త్రయ పద్ధతిలో నిర్వహించామన్నారు. జీవో 9 తీసుకురాకముందే సర్వే పూర్తయ్యిందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలే రిజర్వేషన్‌లకు అడ్డుగా నిలుస్తున్నాయని, ఆరోపించారు. ప్రతి విషయాన్ని బీసీలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. సమయం రాగానే ద్రోహులకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

బీఆర్‌ఎస్‌ చేసిన తప్పిదాలే

నేడు అడ్డంకిగా మారాయి

టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం

రిజర్వేషన్లు అడ్డుకోవడం అన్యాయం1
1/2

రిజర్వేషన్లు అడ్డుకోవడం అన్యాయం

రిజర్వేషన్లు అడ్డుకోవడం అన్యాయం2
2/2

రిజర్వేషన్లు అడ్డుకోవడం అన్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement