
వామ్మో.. ఇవేం రోడ్లు
ప్రయాణం ప్రాణసంకటమే..
చిత్రంలోని రోడ్లను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ దారులపై ప్రయాణం నరకమే. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాహనాలను నడపాల్సిన దుస్థితి. వరుసగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. సిద్దిపేట నుంచి తొగుటకు వెళ్లే ప్రధాన రహదారి, అలాగే తడకపల్లి నుంచి తోగుట మధ్యలో పెద్ద పెద్దగుంతలు, కంకరతేలి ప్రమాదకరంగా మారాయి. మరోవైపు అక్కడక్కడా మూలమలుపులతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట