
ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలేవీ?
గజ్వేల్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో రోగులకు సరైన సేవలు అందించడంలేదని, ప్రైవేటుకు రెఫర్ చేస్తున్నారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్, టెలికామ్ బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల రోగులు ఇబ్బందిపడుతున్నారని వాపోయారు. గతంతో పోలిస్తే ప్రసవాల సంఖ్య సైతం తగ్గిందన్నారు. పరిస్థితి మారకపోతే సహించేదిలేదని హెచ్చరించారు. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బోస్, నాయకులు రామచంద్రాచారి, నత్తి శివకుమార్, చెప్యాల వెంకటరెడ్డి, నరసింహ, సందీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.