
నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
దుబ్బాక: విద్యార్థులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్ అన్నారు. గురువారం దుబ్బాకలో ఏటీసీ(అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్)ను సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, అధునాతనమైన యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ఈ అవకాశాలన్ని అందిపుచ్చుకొని భవిష్యత్త్‌లో అత్యున్నతమైన స్థాయికి చేరుకోవాలన్నారు. ఏటీసీతో విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెరిగి మంచి ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపాల్ కనకయ్య తదితరులు ఉన్నారు.