బిడ్డా.. పైలం | - | Sakshi
Sakshi News home page

బిడ్డా.. పైలం

Oct 9 2025 8:03 AM | Updated on Oct 9 2025 8:03 AM

బిడ్డా.. పైలం

బిడ్డా.. పైలం

● హుస్నాబాద్‌ బాలుర గురుకులంలో 2023 మార్చిలో టెన్త్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థి పై నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ● 2024 డిసెంబర్‌లో సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ విద్యార్థిని కొట్టడంతో తీవ్రగాయాలతో హైదరాబాద్‌లో చికిత్స పొందాడు. తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడితే విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించారు. ● 2025 అక్టోబర్‌లో తరగతి గది ముందు కారిడార్‌ పై ఆడుతుండగా కిందపడి మరణించాడు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థి అనుమానాస్పద మృతితో తల్లిదండ్రుల్లో ఆందోళన గతంలో కొందరికి గాయాలు స్థానికంగా నిద్రించని ఉపాధ్యాయులు పట్టించుకోని ఉన్నతాధికారులు

హుస్నాబాద్‌రూరల్‌: ‘బిడ్డా... పైలం భయపడకు. ఆదివారం బాపును పంపిస్తా’ ఇది హుస్నాబాద్‌ గురుకుల పాఠశాల గేటు ఎదుట బుధవారం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలా ధైర్యం చెప్పారు. మంగళవారం 8వ తరగతి విద్యార్థి వివేక్‌ అనుమానాస్పదస్థితిలో మరణించిన విషయం విదితమే. దీంతో తల్లిదండ్రులు పిల్లల బాగోగులు తెలుసుకొనేందుకు గురుకులానికి పరుగులు తీశారు. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయట నుంచే పిల్లలతో మాట్లాడారు.

బంగారు భవిష్యత్‌ ఉంటుందని..

గురుకుల పాఠశాలలో చేర్పిస్తే చదువులో ముందుంటారని, పిల్లలకు బంగారు భవిష్యత్‌ ఉంటుందని భావించి గురుకులంలో సీట్లు పొందడానికి పోటీపడతారు. ఉపాధ్యాయులు స్థానికంగా ఉండకపోవడంతో విద్యార్థులు క్రమశిక్షణ తప్పుతున్నారు.

ప్రమాద ఘటనలు కొన్ని..

పర్యవేక్షణ కరువు

గురుకులంలో పర్యవేక్షణ కరువైంది. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన గురువులు చీకటి పడగానే ఇంటికి వెళ్తున్నారు. దీంతో రాత్రి వేళ విద్యార్థులను చూసే వారే కరువయ్యారు. రూ.కోట్లు వెచ్చించి భవనాలు నిర్మించినా ఉపాధ్యాయులు స్థానికంగా లేకపోయినా అధికారులు పట్టించుకోవంలేదు.

విద్యార్థి మృతిపై విచారణ చేపట్టాల్సిందే

హుస్నాబాద్‌: సాక్షాత్తు మంత్రి పొన్నం ఇలాకాలోని గురుకులంలోనే విద్యార్థులకు రక్షణ కరువైందని బీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడ్డారు. విద్యార్థి వివేక్‌ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. బుధవారం హుస్నాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బాధిత కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు బీలు నాయక్‌, సుద్దాల చంద్రయ్య, తిరుపతిరెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

హుస్నాబాద్‌లోని గురుకుల పాఠశాల గేటు బయటి నుంచే పిల్లలతో మాట్లాడుతున్న తల్లిదండ్రులు

కట్టుతప్పిన గురుకులాలు

కేటీఆర్‌ ఆరా

హుస్నాబాద్‌: గురుకుల పాఠశాలలో విద్యార్థి వివేక్‌ మృతిపై బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరా తీశారు. విద్యార్థి ఏ తరగతి చదువుచున్నాడు, మృతికి గల కారణాలపై హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యం కల్పించాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే గురుకుల పాఠశాల అధికారులు విద్యార్థి అంత్యక్రియల కోసం రూ.10 వేలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement