
విశ్వబ్రాహ్మణులకూ రిజర్వేషన్లు కల్పించాలి
హుస్నాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే, విశ్వబ్రాహ్మణుల జనాభా ప్రకారం 5 శాతం సీట్లు తమకు కేటాయించాలని విశ్వనాథుల పుష్పగిరి డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణులకు రాజకీయాల్లో తమ వంతు వాటా దక్కాలనే డిమాండ్‌తో ఆయన చేపట్టిన పాదయాత్ర సోమవారం హుస్నాబాద్‌కు చేరుకుంది. ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన ఆయన పాదయాత్ర 13 రోజులుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు రాజకీయాలలో ఎదిగితేనే జాతి మనుగడ సాధ్యమన్నారు. కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు సదానందం, కార్యదర్శి శ్రీనివాస్, మనుమయ సంఘం అధ్యక్షుడు సదానందం, సుదర్శనంచంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.