
గొప్ప పండుగ
బతుకమ్మ చాలా గొప్ప పండుగ. పండుగ వచ్చిందంటే మహిళలు, పిల్లల్లో సంబరమే. నాకు 80 ఏళ్లు. అయినా ప్రతి ఏటా తప్పకుండా బతుకమ్మను పేరుస్తా. నా పిల్లలకు బతుకమ్మ పేర్చడం, పండుగ విశేషాలు నేర్పాను. 12 ఏళ్ల వయస్సు నుంచే బతుకమ్మ ఆడుతున్నా.
– బిల్ల సరోజన, దుబ్బాక
ఘనంగా నిర్వహిస్తాం
సద్దుల బతుకమ్మ పండుగను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తాం. పండుగకు ఆడబిడ్డలు అత్తగారింటి నుంచి తల్లి గారింటికి రావడంతో ఇళ్లన్నీ సందడితో కళకళలాడుతాయి. బతుకమ్మ పండుగ ప్రతి ఏటా సంతోషాన్ని నింపుతుంది.
– ఎర్రగుంట సుజాత, కవయిత్రి లచ్చపేట
పోటాపోటీగా పేర్చేటోళ్లం
మేము చిన్నతనంలో సద్దుల బతుకమ్మను పోటీపడి పెద్దగా పేర్చేటోళ్లం. పండుగకు ఒక రోజు ముందే అడవికి వెళ్లి గునుగు పువ్వు కోసుకొచ్చేవాళ్లం. ఇప్పుడు సద్దుల బతుకమ్మను చిన్నగా పేర్చుతుండ్రు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది.
– స్వాతి, డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు

గొప్ప పండుగ

గొప్ప పండుగ