
బోర్డులే దర్శనం.. మైదానాలు నిరుపయోగం
చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లేక, సరైన వసతులు లేక బోర్డులకే పరిమితమయ్యాయి. ముళ్ల పొదలు, చెత్తా చెదారంతో దర్శన మిస్తున్నాయి. దీంతో లక్షల నిధులు వృథాగా అయ్యాయి. కొన్ని క్రీడా ప్రాంగణాల్లో వసతులు లేక క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా గ్రామాల్లో క్రీడా సామగ్రి కనిపించక కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. అధికారులు స్పందించి వీటిని అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.