
పెంపుడు జంతువులపై అప్రమత్తత అవసరం
జిల్లా పశువైద్య, సంవర్ధక శాఖాధికారి పూర్ణచందర్‌రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పెంపడు జంతువుల పట్ల అప్రమత్తతంగా ఉండాలని జిల్లా పశువైద్య, పశు సంవర్ధకశాఖ అఽధికారి పూర్ణచందర్‌రావు అన్నారు. ప్రపంచ రేబీసీ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో పెంపుడు జంతువులకు టీకాలు వేశారు. పెంపుడు జంతువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. పెంపుడు జంతువులకు వ్యాధులు సంక్రమించినపుడు తప్పనిసరిగా చికిత్స చేయించాలన్నారు. జిల్లాలోని అన్ని పశువైద్యశాలల వద్ద సిబ్బంది చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంటారన్నారు.