
ఒక్కేసి పువ్వేసి చందమామ
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సిద్దిపేటరూరల్: జిల్లా అధికార యంత్రాంగం కలెక్టరేట్‌లో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె.హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్‌తో కలిసి మహిళల ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. ప్రపంచంలోనే పువ్వులను పూజించే ఏకై క పండగ బతుకమ్మ పండగ అని కలెక్టర్ చెప్పారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ఎప్పుడు ఆఫీస్ పనులతో బిజీగా ఉండే ఉద్యోగస్లుఉ సాంప్రదాయ బద్ధంగా బతుకమ్మ పండుగలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కాగా, బతుకమ్మ పండుగ విశిష్టతపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో బహుమతులు సాధించిన ఇ.సాయి సంతోషి, డి.సృజన, జి.మనస్వినిలకు, షార్ట్ ఫిలిం కాంపిటేషన్ విజేత గిరిబాబులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.

ఒక్కేసి పువ్వేసి చందమామ