
సిద్దిపేట సీపీగా విజయ్‌కుమార్
సిద్దిపేటకమాన్: సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ బదిలీ అయ్యారు. నూతన పోలీసు కమిషనర్‌గా ఎస్‌ఎమ్ విజయ్‌కుమా ర్‌ను నియమిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ వెస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న విజయ్‌కుమార్‌ను సిద్దిపేట నూతన సీపీగా నియమిస్తూ, ఇప్పటి వరకు సిద్దిపేట సీపీగా కొనసాగిన అనురాధను ఎల్‌బీ నగర్ డీసీపీగా నియమించారు.
పండుగలు సంస్క ృతికి ప్రతీకలు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
మిరుదొడ్డి(దుబ్బాక): పండుగలు సంస్క ృతీ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని శ్రీ దేవి నవరాత్రోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గా మాతను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తి భావనతో పాటు సామాజిక సేవను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు సూకూరి లింగం, మాజీ ఏఎంసీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ మల్లేశం, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ కో అప్షన్ మెంబర్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ భైరయ్యపాల్గొన్నారు.
లక్ష్మణ్ బాపూజీకి నివాళి
సిద్దిపేటకమాన్/ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలో బాపూజీ విగ్రహానికి కలెక్టర్ హైమావతి శనివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల, తదితరులు పాల్గొన్నారు. అలాగే.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ పాల్గొన్నారు.
బాపూజీ బాటలో ముందుకు సాగాలి: ప్రొఫెసర్ కోదండరాం
ములుగు(గజ్వేల్): కొండా లక్ష్మణ్ బాపూజీ అంకిత భావం స్ఫూర్తిగా సమాజ సేవకు యువత నడుం బిగించాలని ప్రొఫెసర్ ఎం.కోదండరాం పిలుపు నిచ్చారు. ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన ఆచార్య లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ బాపూజీ జీవితం, రాజకీయ చరిత్ర నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, ఉద్యాన వర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్.దండా రాజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

సిద్దిపేట సీపీగా విజయ్‌కుమార్