
ఆయిల్‌పామ్ హబ్‌గా సిద్దిపేట
అందుబాటులోకి నర్మెట ఫ్యాక్టరీ రూ.300 కోట్ల వ్యయంతో నిర్మాణం ప్రస్తుతం క్రషింగ్ ట్రయల్ రన్
గజ్వేల్: ఆయిల్‌పామ్ సాగుకు సిద్దిపేట జిల్లా హబ్‌గా మారబోతుంది. తెలంగాణలో ఐదేళ్ల క్రితం కొత్తగా ప్రారంభమైన సాగును క్రమంగా విస్తరించుకుంటూ సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగును పెంచేందుకు కేంద్రం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఆయిల్‌పామ్(ఎస్‌ఎంఈఓ) పథకంలో భాగంగా నాలుగేళ్లల్లో తెలంగాణ 1,25,300 హెక్టార్ల సా గు లక్ష్యానికి తెలంగాణ ఇప్పటివరకు 78,869 హెక్టార్లకుపైగా లక్ష్యాన్ని సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో సాగు పెరుగుతూ వస్తున్న జిల్లాల్లో సిద్దిపేట తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది. గడిచిన ఐదేళ్లల్లో ఇక్కడ 12,350 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులోకి వచ్చింది. జిల్లాలోని నర్మెటలో మాజీ మంత్రి హరీశ్‌రావు కృషి ఫలితంగా రూ.300 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులు పూర్తికాగా, ప్రస్తుతం క్రషింగ్‌ను ట్రయల్ చేస్తున్నారు. దీని కారణంగా రాబోవు రోజుల్లో జిల్లాలో ఆయిల్‌పామ్ మరింతగా పెరగనున్నది. నర్మెటలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ ఆయిల్‌పామ్ సాగు సమీప జిల్లాలో విస్తరించడానికి అడుగులు పడ్డాయి. ఇంతకాలం మార్కెటింగ్ సౌకర్యాలు సక్రమంగా లేక, సాగుకు వెనుకంజ వేసిన రైతులు ఆయిల్‌పామ్ సాగును పెంచుకునే అవకాశం కలిగింది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో నిత్యం 30 టన్నుల క్రషింగ్ సామర్థ్యం కలిగివున్నది. ఎక్కడాలేని విధంగా రిఫైనరీ, ప్యాకింగ్‌కు అవకాశమున్నది. ఇక్కడి నుంచి ప్యాకింగ్ ఉత్పత్తులు నేరుగా మార్కెట్‌లోకి వెళ్లనున్నాయి. ఇందుకు సంబంధించి యంత్ర సామగ్రి ఇప్పటికే అమర్చారు. ఈ అంశంపై సిద్దిపేట జిల్లా ఉద్యానవనశాఖాధికారి సువర్ణ ‘సాక్షి’తో మాట్లాడుతూ రాబోవు రోజుల్లో ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించి హబ్‌గా మారే అవకాశమున్నదని చెప్పా రు. జిల్లాలోని రైతులకు ఈ సాగు కొత్తయినా, ఏటా ఈ పంటను సాగుచేసే రైతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నదని, ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు.
గణనీయంగా పెరుగుతున్న సాగు