
ఐటీఐలో కొత్త కోర్సులు
● కలెక్టర్ హైమావతి ● అధునాతన సాంకేతిక కేంద్రం ప్రారంభం
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐలో అధునాతన సాంకేతిక కేంద్ర (ఏటీసీ) బోధన తీరులను శనివారం కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్ధిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగి తే విజయం సాధిస్తారన్నారు. ప్రభుత్వం అందిస్తు న్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలన్నారు. మారుతున్న కాలంతో సాంకేతిక నైపుణ్యతను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని చెప్పారు. ఐటీఐలో కొత్త కోర్సులను చేర్చి శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఉపాధి అందించేలా చర్యలు చేపట్టామన్నారు. కాగా, విద్యార్థులు చెక్కపై మిషన్‌తో బొమ్మలు తయారు చేసిన తీరు లను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపల్ రమణ పాల్గొన్నారు.
వైద్యం చేయడంలో నిర్లక్ష్యం చేయొద్దు
స్వస్తినారి సశక్త్ పరివార్ అభియాన్‌లో వైద్య సేవ లందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించి వైద్యం అందుతున్న తీరులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అక్టోబరు 2 వరకు స్వస్తినారి సశక్త్ పరివార్ అభియాన్ వైద్య సేవలందిస్తామన్నారు. పీహెచ్‌సీ పరిధిలో ఇప్పటి వరకు 85 మందికి పైగా మహిళలకు వైద్యం అందించామంటూ వైద్యులు శ్రీధర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.