
చెరువులు,కుంటలపై దృష్టి సారించండి
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ● ఇరిగేషన్ అధికారులతో సమీక్ష
దుబ్బాక: భారీ వర్షాల నేపథ్యంలో నిండుకుండల్లా మారిన చెరువులు, కుంటల రక్షణపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. ఇరిగేషన్ అధికారులతో నీటిపారుదల రంగంపై సమీక్షించారు. ఎడతెరిపిలేకుండా కురుస్తు న్న వర్షాలతో చెరువులు పూర్తిగా నిండి మత్తడి దూకుతున్నాయన్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రమాదకరంగా ఉన్న చెరువుకట్టల రక్షణ కోసం తగు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.