
జోరు వాన.. జనం హైరానా
కొండపాకలో 85 మి.మీ.వర్షం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/దుబ్బాక: జిల్లాలో సోమ వారం జోరుగా వర్షం కురిసింది. దుబ్బాక పట్టణంలో ఏకధాటిగా రెండు గంటల పాటు వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొండపాకలో 85మిల్లీమీటర్లు, కొమురవెల్లిలో 72 మి.మీ., సిద్దిపేటలో 71.5మి.మీ.వర్షపాతం నమో దు అయ్యింది. అయితే సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షంతో ప్రజలు, వాహనదారులకు తిప్పలు తప్పలేదు.
డీఈ కార్యాలయంపై పిడుగు..
జిల్లా కేంద్రంలోని విధ్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీ ర్ శాఖ కార్యాలయంపై పిడుగు పడడంతో ప్రమా దం చోటు చేసుకుంది. పిడుగు పడే సమయంలో కార్యాలయంలో ఆరుగురు ఇంజనీర్లు విధులు నిర్వ హిస్తున్నారు. పిడుగు పడడంతో విద్యుత్ పరిక రాలు, కంప్యూటర్లు ముఖ్యమైన పరికరాలు దెబ్బతిన్నాయి. కొద్దిసేపు విద్యుత్ సరాఫరాకు అంతరా యం ఏర్పడింది. సిబ్బంది మరమ్మతులు చేపట్టి సరాఫరాను పునరుద్ధరించారు. ఈ పిడుగు ప్రమాదంలో సుమారుగా రూ. 10 లక్షల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షం