
యూరియా కోసం అవే బారులు
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. సోమవారం తెల్లవారుజామునుంచే రైతులు పీఏసీఎస్‌తో పాటు, గోదాం వద్ద బారులు తీరారు. గంటల తరబడి పడిగాపులు పడితే తప్ప యూరియా బస్తా దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంట కాలం అదను దాటిపోతుండటంతో యూరియా కొరత వల్ల తీవ్ర నష్టాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరిగతిన యూరియా అందుబాటులోకి తెచ్చి తమను నష్టాల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.