
అర్జీల పరిష్కారానికి కృషి
● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ● వచ్చిన దరఖాస్తులు 174
సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను సత్వరం పరిష్కరించనున్నట్లు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్ లో నిర్వహించిన ప్రజావాణిలో గరీమా అగర్వాల్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జిదారులకు న్యాయం జరిగేలా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భూ సంబంధిత, హౌసింగ్, పెన్షన్లు వంటి ఇతర అర్జీలు మొత్తం 174 వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.