
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో భక్తుల రాక పెరిగింది. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. మల్లన్నకు పూజలు చేసి, పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. కోరికలు తీర్చాలంటూ గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టారు. అనంతరం కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి బోనంతో నైవేద్యం సమర్పించారు. ఆలయ ఈఓ అన్నపూర్ణ, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్‌లు పర్యవేక్షించారు.
ఆర్యవైశ్యులు
అన్ని రంగాల్లో రాణించాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలని, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంపశ్రీనివాస్ అన్నారు. వివిధ రంగాల్లో రాణించిన ఆర్యవైశ్యులకు ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య, వైద్య, వ్యాపారం, రాజకీయంతో పాటుగా అన్ని రంగాల్లో ఆర్యవైశ్యులు ముందంజలో ఉండాలన్నారు. ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో ముందుండటం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు ఆంజనేయులు, హరినాథ్, డాక్టర్ మాంకాల నవీన్ కుమార్, కాసం నవీన్, గంప కృష్ణమూర్తి, యాసాల వెంకట లింగం, హేమలత, రాజమౌళి, లింగమూర్తి, రవికుమార్ పాల్గొన్నారు.
న్యూట్రిషన్ ఫుడ్‌తో
ఆరోగ్యంగా ఉండాలి
బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు వందన
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని అల్లీపూర్ కేజీబీవీ పాఠశాలను ఆదివారం బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు కంచర్ల వందన సందర్శించారు. విద్యార్థులకు ఉన్న సదుపాయాలు, ఉపాధ్యాయుల ప్రవర్తన, విద్యా విధానం, సమస్యలు విద్యార్థులను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చన్నారు. బాల్య వివాహలపై జరిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో డీసీపీఓ రాము, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి