
జిల్లా కవులకు ఘన సన్మానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవులు పెందోట వెంకటేశ్వర్లు, వర్కోలు లక్ష్మయ్యలను ఘనంగా సన్మానించినట్లు బాల సాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం ఆదివారం తెలిపారు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్, తెలంగాణ పోలీస్‌శాఖ, జ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో పోలీస్ సామాజిక బాధ్యత అనే అంశంపై హైదరాబాద్‌లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో ఆదివారం కవి సమ్మేళనం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లాకు చెందిన కవులు పెందోట వెంకటేశ్వర్లు, వర్కోలు లక్ష్మయ్య పాల్గొని పోలీసులపై కవితాగానం వినిపించారని తెలిపారు. కవులు ఎన్నవెళ్లి రాజమౌళి, మిట్టపల్లి పరశురాములు, ఎడ్ల లక్ష్మి, బైతి దుర్గయ్య వారికి అభినందనలు తెలిపారు.