
ఏసీ రెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం
కొమురవెల్లి(సిద్దిపేట): తెలంగాణ రైతాంగ సాయు ధ పోరాటయోధుడు జనగామ మాజీ ఎమ్మెల్యే ఏసీరెడ్డి నర్సింహారెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని సీపీఎం మండల కార్యదర్శి తాడూరి రవీందర్ పిలుపునిచ్చారు. సోమవారం నర్సింహారెడ్డి 34వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఏసీ రెడ్డి నాడు భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించారన్నారు. దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి వేలాది ఎకరాల భూములను పేదలకు పంచారని కొనియాడారు. మల్లేశం, ఎల్లయ్య, రవీందర్, భరత్‌కుమార్, రాకేశ్ పాల్గొన్నారు.