
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
వ్యవసాయ అధికారి మల్లేశం
మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలో యూరి యా కృత్రిమ కొరత సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి మల్లేశం హెచ్చరించారు. మిరుదొడ్డిలోని పీఏసీఎస్, చెప్యాలలోని డీసీఎంఎస్ కేంద్రాలను సోమవారం ఆయన సందర్శించారు. రెండు కేంద్రాలకు సరఫ రా అయిన 40 మెట్రిక్ టన్నుల యూరియా రైతు లకు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం పలు ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. రికార్డులు, రసాయన ఎరువులు, విత్తనాల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని రైతులకు కావాల్సిన యూరియా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మిరుదొడ్డి పీఏసీఎస్ సీఈఓ రాజు, ఏఈఓ లు అఖిల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.