
భవిష్యత్ ముద్దు సోషల్ మీడియా వద్దు
జగదేవ్‌పూర్(గజ్వేల్): విద్యార్థులు భవిష్యత్‌ను లక్ష్యంగా పెట్టుకుని విద్యను అభ్యసించాలని, సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని ఎస్‌ఐ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం జగదేవ్‌పూర్‌లో కేజీబీవీ పాఠశాలలో షీటీమ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు వివిధ చట్టాలు, అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చట్టాలు, సైబర్‌నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఉన్నతస్థాయికి ఎదగాలంటే విద్య ఒకటే మార్గమని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్రవంతి, ఏఎస్‌ఐ రమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.