
పేదల సంక్షేమానికే ప్రాధాన్యం
కోహెడ(హుస్నాబాద్): పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం స్థానిక రైతువేదికలో కల్యాణలక్ష్మి, రేషన్ కార్డులు, కాటమయ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 26 వేల మందికి నూతల రేషన్‌కార్డులు అందించామన్నారు. కోహెడ. హుస్నాబాద్, అక్కెన్నపేటలో 3,799 రేషన్‌కార్డులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కోహెడ మండలంలో 506 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని.. ఇందులో 72 మినహాయించి 432 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 72 ఇళ్ల లబ్ధిదారులు సైతం నిర్మాణ పనులు చేసుకోవాలని కోరారు. మండలంలో మహిళా సంఘాలకు నాలుగు నెలల్లో రూ.కోటీ 15లక్షలకు పైగా వడ్డీలేని రుణాలు అందించినట్లు చెప్పారు. పేదలు, మహిళలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 41 మందికి కల్యాణలక్ష్మి చెక్‌లు, పలువురి గీతకార్మికులకు కాటమయ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, గంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, కోహెడ ఏఎంస్సీ చైర్మన్ నిర్మల, తహసీల్దార్ ఎండీ సమీర్‌అహ్మద్ ఖాన్, ఎంపీడీఓ కృష్ణయ్య పాల్గొన్నారు.
ఆడ బిడ్డల ఆనందమే ముఖ్యం
హుస్నాబాద్‌రూరల్: ఆడ బిడ్డలను ఆస్తిపరులను చేయడమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం పోతారం(ఎస్)లో ఏర్పాటు చేసిన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డూ కూడా ఇవ్వలేదన్నారు. మహిళ సంక్షేమ కోసం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, ప్లాస్టిక్‌ను నిషేధించడానికి ఉచితంగా స్టీల్ బ్యాంక్‌ను మహిళా సంఘాలకు అందిస్తున్నామన్నారు. వన మహోత్సవంలో ప్రతి మహిళ ఇంట్లో తులసి, జామ, నిమ్మ, మునుగ, కరివేపాకు మొక్కలను నాటాలని చెప్పారు. మడదలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రూ.8 కోట్ల సోలార్ ప్లాంట్ ప్రోసిడింగ్స్‌ను అందించారు.
పథకాలు సద్వినియోగం చేసుకోండి
జిల్లాలో 26 వేల
రేషన్‌కార్డులు అందజేత
మంత్రి పొన్నం ప్రభాకర్

పేదల సంక్షేమానికే ప్రాధాన్యం