భూగర్భజలాలు పెంచే దిశగా పనులు | - | Sakshi
Sakshi News home page

భూగర్భజలాలు పెంచే దిశగా పనులు

Oct 10 2026 8:02 AM | Updated on Oct 10 2026 8:02 AM

కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

సంగారెడ్డి జోన్‌: ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు పెంపొందించే పనులు చేపట్టాలని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో పాటు కలెక్టర్‌ హాజరయ్యారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ మాట్లాడారు. వర్షపాతం లోటు ఏర్పడే అవకాశాలు, భూగర్భ జలమట్టాల తగ్గుదల, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, బోరుబావుల రీచార్జ్‌, చెరువులు, కుంటల పునరుద్ధరణ వంటి పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని తెలిపారు. వేసవిలో వరి సాగు నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భజలాల స్థితిగతులు, వర్షపాతం అంచనాలను పరిగణనలోకి తీసుకుని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి, అదనపు కలెక్టర్‌ పాండు, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement