రాంసాన్‌పల్లిలో దొంగల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

రాంసాన్‌పల్లిలో దొంగల బీభత్సం

Oct 5 2026 8:24 AM | Updated on Oct 5 2026 8:24 AM

● తాళం వేసిన మూడిళ్లలో చోరీ ● బంగారం, వెండితోపాటు నగదు, బైక్‌ అపహరణ

● తాళం వేసిన మూడిళ్లలో చోరీ ● బంగారం, వెండితోపాటు నగదు, బైక్‌ అపహరణ

వట్‌పల్లి(అందోల్‌): అందోల్‌ మండలంలోని రాంసాన్‌పల్లిలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లలో చొరబడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, బైక్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్‌ఐ శ్రీకాంత్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాందపురం శ్రీనివాస్‌ గౌడ్‌ ఇంటికి తాళం వేసి తన కుమారుడికి చికిత్స నిమిత్తం కుటుంబంతో కలిసి సంగారెడ్డికి వెళ్లాడు. గమనించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెలతాడు, మూడు మాసాల బంగారు మాటీలు, ఐదు తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన కడారి మల్లారెడ్డి ఇంటికి తాళం వేసి ఇంటి పైఅంతస్తులో పడుకున్నాడు. ఇంటి తాళం పగులగొట్టి రూ.60 వేల నగదుతో పాటు ఒక గ్రాము గోల్డ్‌ , రెండు తులాల వెండి వస్తువులను అపహరించారు. అనంతరం పాలడుగు మోహన్‌రెడ్డి ఇంటి ముందు నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. మందాపురం అంజాగౌడ్‌ బైక్‌ను కొద్ది దూరం తీసుకెళ్లి స్టార్ట్‌ కాకపోవడంతో వదిలిపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. గ్రామంలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. క్లూస్‌ టీం వేలిముద్రలను సేకరించింది. ఘటనపై కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ములుగు పరిఽధిలో మూడిళ్లలో..

ములుగు(గజ్వేల్‌): మూడిళ్లలో దొంగలు చొరబడి నగదుతోపాటు బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఎస్‌ఐ వి.రఘుపతి వివరాల ప్రకారం.. కొత్తూరు గ్రామానికి చెందిన కీసరి సాయిబాబు కుటుంబం మరో ఇంటికి మారడంతో పాత ఇంటికి తాళం వేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం అతడు తన తమ్ముడు సతీశ్‌తో కలిసి వెళ్లి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. మూడు బీరువాలను పగులగొట్టి అందులో ఉన్న రూ.80 వేల నగదును ఎత్తుకెళ్లారు. అలాగే బండమైలారం గ్రామానికి చెందిన సిగిరిపల్లి యాదగిరి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లగా దుండగులు ఇంటి తలుపు హ్యాండిల్‌ను కత్తిరించి లోపలికి వచ్చారు. బెడ్రూమ్‌లోని వార్డురోబ్‌ లాకర్‌ను పగులగొట్టి సుమారు రూ.85 వేల విలువ చేసే బంగారు ఉంగరం, చెవిపోగులు అపహరించారు. అదే గ్రామానికి చెందిన సరిగొప్పుల సత్యనారాయణ, తన భార్య స్వరూపకు అనారోగ్యంగా ఉండటంతో ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లారు. తిరిగొచ్చే సరికి తలుపులు తెరిచి ఉండటంతో పాటు సుమారు రూ.70 వేలు విలువ చేసే నగదు, వెండి అభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement