మునిపల్లి(అందోల్): పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని మేళసంగ్యం గ్రామంలో చోటు చేసుకుంది. బుదేరా ఎస్‌ఐ అరవింద్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాజు (20) గత నెల 21న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మృతుడి తండ్రి పెద్దగొల్ల మల్లయ్య పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం మల్లయ్య కౌలుకు తీసుకున్న భూమిలో పంటను చూడడానికి వెళ్లగా రాజు పొలం దగ్గర గుర్తు తెలియని పురుగుల మందు తాగి విగత జీవిగా పడి ఉన్నాడు. ఎస్‌ఐ అరవింద్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక్కగానొక్క కొడుకు తన కండ్ల ముందే మృతి చెందడంతో మల్లయ్య బోరున విలపించాడు.


