ఉపాధ్యాయుడికి అవార్డు ప్రదానం | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడికి అవార్డు ప్రదానం

Oct 5 2026 8:24 AM | Updated on Oct 5 2026 8:24 AM

టేక్మాల్‌(మెదక్‌): మనం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పి.ఎంశ్రీ. జడ్పీహెచ్‌ఎస్‌ కుసంగి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఆర్‌.శంకర్‌ను ‘మహాత్మా గాంధీ జాతీయ విద్యారత్న‘ అవార్డుతో సత్కరించారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలు, విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు చేస్తున్న కృషి, సామాజిక అవగాహన కార్యక్రమాల్లో చురుకై న భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మనం ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.చక్రవర్తి అడ్వకేట్‌, రామకృష్ణతోపాటు పలు అవార్డు గ్రహీతలు, ప్రముఖులు పాల్గొన్నారు.

విద్యార్థిపై కుక్కల దాడి

కాలికి గాయం

హత్నూర(సంగారెడ్డి): కుక్కల దాడిలో విద్యార్థి కాలికి గాయమైంది. ఈ ఘటన మండలంలోని కాసాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విద్యార్థి వేణు డిగ్రీ చదువుతున్నాడు. ఉదయం రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా కుక్కలు గుంపుగా వచ్చి దాడి చేశాయి. దీంతో విద్యార్థి కాలికి గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మండలంలోని పలు గ్రామాల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేశారు.

ఎర్రరాయి తరలిస్తున్న

లారీ పట్టివేత

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): కర్నాటక ప్రాంతంలోని మన్నెల్లి నుంచి అక్రమంగా లారీలో తరలిస్తున్న ఎర్రరాయిని ఆదివారం హద్నూర్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ సుజిత్‌ కథనం ప్రకారం.. మండల పరిధిలోని గంగ్వార్‌ చౌరస్తా వద్ద ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో కర్నాటక ప్రాంతం నుంచి ఎర్రరాయి లోడ్‌తో వస్తున్న లారీని తనిఖీ చేయగా ఎలాంటి అనుమతి పత్రాలు లేవు. దీంతో లారీని స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ శివకుమార్‌పై కేసు నమోదు చేశారు.

వ్యర్థాలు తరలిస్తున్న

వాహనం సీజ్‌

పటాన్‌చెరు: చికెన్‌ సెంటర్ల నుంచి 1,100 కిలోల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని ఎస్‌ఓటీ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా.. పటాన్‌చెరు డివిజన్‌ పరిధిలోని పాత బీజేపీ కార్యాలయం సమీపంలో వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని గుర్తించిన ఎస్‌ఓటీ అధికారులు అదుపులోకి తీసుకుని వెటర్నరీ అధికారులకు అప్పగించారు. శేరిలింగంపల్లి మున్సిపల్‌ జోన్‌ వెటర్నరీ డాక్టర్‌ గీత ఆధ్వర్యంలో అధికారులు వాహనాన్ని సీజ్‌ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి సీజ్‌ చేసిన వాహనాన్ని పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తనిఖీల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నాగరాజుతో పాటు స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

ఎండు గంజాయి పట్టివేత

వ్యక్తి అరెస్ట్‌

పటాన్‌చెరు టౌన్‌: ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పటాన్‌చెరు ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎకై ్సజ్‌ సీఐ శ్రవణ్‌ కుమార్‌ కథనం ప్రకారం... జేపీ కాలనీ డివిజన్‌ పరిధిలోని బండ్లగూడ కమాన్‌ సమీపంలో ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో బీరంగూడకు చెందిన ఇపాటి వంశీనీ అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు 2.3 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్‌ ఎస్‌ఐ షేక్‌ ఫయాజ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీధర్‌, కానిస్టేబుళ్లు రవీందర్‌ నాయక్‌, సురేశ్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement