స్టేడియంను అభివృద్ధి చేద్దాం | - | Sakshi
Sakshi News home page

స్టేడియంను అభివృద్ధి చేద్దాం

Oct 5 2026 8:24 AM | Updated on Oct 5 2026 8:24 AM

మంత్రి దామోదర రాజనర్సింహ

మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట(అందోల్‌): జోగిపేట ఎన్టీఆర్‌ స్టేడియం అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేయించడానికై నా సిద్ధంగా ఉన్నానని మంత్రి సి.దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం జోగిపేట వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు స్టేడియానికి రూ.10 కోట్లు మంజూరు చేయించినందుకు సంగారెడ్డిలోని స్వగృహంలో మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడారు. అన్ని హంగులతో స్టేడియంను అభివృద్ధి చేద్దామని, ప్రస్తుతం మంజూరైన రూ.10కోట్లతో పాటు మరో పది కోట్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. స్టేడియంలో స్మిమ్మింగ్‌ పూల్‌, జిమ్‌, బాస్కెట్‌బాల్‌, ఖోఖో, కబడ్డీ కోర్టులు, ఫ్లడ్‌ లైట్లు, వాకింగ్‌ ట్రాక్‌ పునఃరుద్ధరణతో పాటు పెవీలియన్‌ల నిర్మాణంపై చర్చించారు. అసోసియేషన్‌ సభ్యులు విఠల్‌, యెదిరె రమేశ్‌, ప్రవీణ్‌, రాంబాబు, రాజశేఖర్‌, దుర్గయ్య, కోరంపల్లి రవి, దమ్మగల్ల రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement