సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా శాస్త్ర విజ్ఞానాన్ని నిత్య జీవితానికి అన్వయించుకోవాలని డీసీఈబీ కార్యదర్శి లింబాజీ విద్యార్థులకు సూచించారు. సంగారెడ్డిలోని సైన్స్ కేంద్రంలో డీఈఓ సూచనల మేరకు మంగళవారం ‘శాస్త్రం – సమాజం’అనే అంశంపై జిల్లాస్థాయి సైన్స్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా లింబాజీ మాట్లాడుతూ ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనా ఆసక్తి, సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయన్నారు. ఈ పోటీల్లో పటాన్‌చెరు మండలంలోని ఇస్నాపూర్ త్రివేణి పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి, ఖేడ్‌లోని తక్షశిల పాఠశాల విద్యార్థులు ద్వితీయ బహుమతి, జిన్నారం మండలం ఖాజిపల్లి తులిశారెడ్డి పాఠశాల విద్యార్థులు తృతీయ బహుమతి దక్కించుకున్నారు. వీరికి డీసీఈబీ సెక్రటరీ లింబాజీ, జిల్లా సైన్స్ అధికారి సిద్దారెడ్డి బహుమతిని అందజేశారు. మొదటి స్థానం పొందిన విద్యార్థులు ఈ నెల 25, 26 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ డ్రామా పోటీలో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు రవీందర్‌రెడ్డి, మురళి, అశోక్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో సిఆర్పీలు దత్తు, కల్పన, లలిత పాల్గొన్నారు.
డీసీఈబీ కార్యదర్శి లింబాజీ


