● సోలార్ ప్యానెల్స్‌పై పరిశోధనకు థైవాన్ ఎక్స్‌లెన్స్ అవార్డు
● ప్రతిభ చాటిన హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తైవాన్ నేషనల్ యూనివర్సిటీ ఆ దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీలో హైదారాబాద్ ఐఐటీ విద్యార్థులు ప్రతిభను చాటారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థుల బృందం ప్రదర్శనకు అంతర్జాతీయస్థాయిలో ఎక్స్‌లెన్స్ అవార్డు వరించింది. రూ.1.5 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ విభాగానికి చెందిన విద్యార్థులు మహక్‌గాడియా, రాఖీమహమ్మద్, మెకానికల్ విభాగానికి చెందిన ఉదిత్‌మైనీ, ఇంజనీరింగ్ ఫిజిక్స్‌కు చెందిన యుగ్‌నికేష్‌లు సోలార్ ప్యానెల్స్‌పై చేస్తున్న పరిశోధనలను ప్రదర్శించారు. 70 సెం.మీల ఉష్ణోగ్రతతో పాటు, అత్యధిక తేమను తట్టుకోగలిగిన 25 సెం.మీ స్కొయర్ ప్యానెల్స్‌లను ప్రదర్శించారు. అంతర్జాతీయ జ్యూరీ విభాగం ఈ ప్రదర్శనను ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డు దక్కించుకున్న విద్యార్థులను ఐఐటీహెచ్ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి, ఈ బృందం సూపర్‌వైజర్ ఆశిశ్‌కులకర్ణిలు అభినందించారు.


