ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్‌తో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వ్యక్తులతో పరిచయాలేర్పడి నూతన విషయాలు నేర్చుకునే అవకాశముంది. దూరంలో ఉన్న స్నేహితులతో కూడా ఎప్పటికప్పుడు సులభంగా మాట్లాడుకునే వీలుంటుంది. అయితే అందరూ ఒకేలా ఉండరు.
–రమ్య, డిగ్రీ, విద్యార్థిని, సిద్దిపేట.
నిజమైన స్నేహమే నిలబడుతుంది
నిజమైన స్నేహాన్ని కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. నమ్మకం, నిజాయితీ, గౌరవం ఉన్నచోట నిజమైన స్నేహం పది కాలాలపాటు నిలబడుతు ంది. అలాంటి నిజమైన స్నేహితుడు మన ఆనందాన్ని రెట్టింపు చేసి బాధను సగానికి తగ్గిస్తాడు.
–గురుచరణ్, బీఎస్సీ, డిగ్రీ విద్యార్థి, సిద్దిపేట.
బాధను మర్చిపోతాం
స్నేహానికి అధిక ప్రాధా న్యతనిస్తాను. స్నేహితులు మనకు కావాల్సినవన్నీ ఇవ్వకపోవచ్చు కానీ ఎలాంటి సమయంలోనైనా మనతో నిలబడి మన విజయంలో పాలు పంచుకుంటారు. స్నేహం మనకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మంచి విలువను నేర్పిదిలా ఉండాలి.
–మల్లికార్జునచారి, ఎంబీపీటీఎస్, డిగ్రీ విద్యార్థి, సిద్దిపేట.


